తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అమ్మ ఒడికి మరో రూపం అంగన్వాడి టీచర్.టీచర్స్ ని శాలువాల తో సత్కరించిన కార్పొరేటర్ మునిగడప పద్మ. అమ్మ ఒడికి మరో రూపం అంగన్వాడీ టీచర్స్ అని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. శనివారం నెహ్రూ బస్తి అంగన్వాడి సెంటర్ లో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో అమ్మ కడుపులో పడిన నాటి నుంచి పాపాయి పాలు తాగే వయసు దాటి బడిబాట పట్టే వరకు ప్రతిక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ మరో అమ్మగా నిలిచే ప్రేమ మూర్తులు అంగన్వాడీ టీచర్స్ ఆమె కొనియాడారు. నడక నేర్పే తోలి అడుగుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే పౌష్టికాహారం తో పాటు ఆటపాటలతో వేసే తొలి చదువులో పునాదిలో మీ సేవలు అమూల్యం, అద్భుతమని అంగన్వాడీ టీచర్స్ ఉద్దేశించి అన్నారు. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ, సమాజ ఆరోగ్యానికి పునాదులు వేస్తూన్న అంగన్వాడీ టీచర్స్ కి, ఆయాలకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్లోని మూడు సెంటర్ల అంగన్వాడి టీచర్స్ ని కార్పొరేటర్ మునిగడప పద్మ శాలువాలతో, పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా సెంటరు లోని తల్లిదండ్రులు కుమార్ స్వాతి దంపతులు సెంటర్ కోసం టేబుల్ ఫ్యాన్ ను బహుమతిగా ఇవ్వడం మరియు కోరి ప్రియాంక అశోక్ కుమార్ దంపతులు రెండు కుర్చీలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎన్ సరోజ, దొంగ నీలవేణి, రమాదేవి, షహనాజ్ బేగం ఆయా వెంకటలక్ష్మి, తల్లులు మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ