తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ కు జూలూరుపాడు మండల బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జూలూరుపాడు మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాం రాథోడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గిరిజన కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు జాటోత్ హుస్సేన్ నాయక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, అభివృద్ధి తదితర అంశాలపై నాయకులు ఆయనతో చర్చించారు. గిరిజనుల సమస్యలను జాతీయ స్థాయిలో పరిష్కరించేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు. గిరిజన సమాజ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అవకాశాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ మరింత విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల బీజేపీ ఉపాధ్యక్షులు దరావత్ బాలకిషన్, గోపాలరావు, ప్రధాన కార్యదర్శులు రామారావు, భూక్యా శ్రీను, గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి, యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు కార్యదర్శి బాబూలాల్, ఓబీసీ మోర్చా నాయకుడు నవీన్, సోషల్ మీడియా కన్వీనర్,చరణ్, పృధ్వీ, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు జాటోత్ మధు, గిరిజన కుల సంఘాల నాయకులు కేశవ్ నాయక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ