తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన గ్రామసభలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీలోని ఐదవ వార్డులో మంగళవారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు. జాబితాలో పేర్లు రాని కొందరు, తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సభకు వచ్చిన అధికారుల వద్దకు చేరుకొని నిలదీశారు. అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లని లబ్దిదారుల జాబితాలో ఎందుకు చేర్చలేదని అధికారులతో వాగ్వాదం చేశారు. దీంతో గ్రామసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులు వారిని మరల దరఖాస్తు చేసుకోవాలని, ఎంక్వయిరీ చేసి అర్హులైతే జాబితాలో పేర్లు చేరుస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ