తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన కేకే కమిటీతో ఈనెల 8వ తేదీన హైదరాబాద్ అమరవీరుల జ్యోతి కార్యాలయంలో కేకే కమిటీతో సంపత్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగొటి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న విద్యార్థి ఉద్యమ నాయకులతో ఈ భేటీ ఉంటుందన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, గ్యాంగ్ స్టార్, రౌడీషీట్ లు కేసుల పాలై, జైలు జీవితం గడిపిన విద్యార్థి నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులతో సమావేశమైన కేకే నేతృత్వంలోని ఈ కమిటీ తగు సూచనలు తీసుకున్న నేపథ్యంలో ఈనెల 8వ తేదీన పొనుగోటి సంపత్ బృందం ఇచ్చే సలహాలు సూచనలతో తుది నివేదిక తయారు చేయనునట్లు వారు తెలిపారు.ఈ సమావేశానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక నాయకత్వం వహించిన విద్యార్థి ఉద్యమ నాయకులు, తన సహచర విద్యార్థి ఉద్యమ నేతలు రానున్నట్లు వారు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ