తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 30(తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల కేంద్రంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం మెయిన్ రోడ్డు సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ మరియు బస్ షెల్టర్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతి ఒక్కరు వారి వారి పనులు నిమిత్తం సెంటర్కు వచ్చి గంటల తరబడి సెంటర్లో ఉంటున్నారు అలాంటి వారికి పబ్లిక్ టాయిలెట్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మరి ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా బస్సు షెల్టర్ లేక మండల ప్రజలు ఇటు ఖమ్మం కు అటు కొత్తగూడానికి వారి వారి అవసరాలు నిమిత్తం ఎల్లాలిసి వచ్చిన ప్రజలు బస్సులు కోసం నడిరోడ్డు మీద ఎర్రటి ఎండలో నిలిచావలసి వస్తుంది వర్షం అయితే వర్షంలోనైనా తడుసుకుంటూ నిలుచవలసి వస్తుంది . ప్రజల అవసరాలు నిమిత్తం సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ త్వరగా నిర్మించాలని వారన్నారు లేని పక్షంలో దశలవారీగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ BGPS జిల్లా ప్రధాన కార్యదర్శి మూడ్ నాగరాజ్ చౌహాన్ వీరన్న, బహుజన సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ