Thursday, 17 September 2026 03:18:57 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష సమావే శం.

Date : 08 September 2025 07:10 PM Views : 370

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రెండవ సాధారణ ఎన్నికలు ( ఎంపీటీసీ/ జెడ్పిటిసి -2025) నిర్వహణలో భాగంగా, మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల జాబితా మరియు పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం తయారుచేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మరియు పోలింగ్ స్టేషన్లో జాబితాను రాజకీయ పార్టీ నాయకులకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 471 పంచాయతీలలో మొత్తం 6,69,048 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,25,045, మహిళలు 3,43,979 మంది కాగా 24 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు.4168 వార్డులకు గాను 4242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు చేసుకోవడం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పేర్లు చేర్పులు ఉండబోవు అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఓట్లు బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన పోలింగ్ కేంద్రాలు యధాతరంగా కొనసాగుతాయని, వాటిలో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆయన అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పి సీఈవో చంద్రశేఖర్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బాల ప్రసాద్, భారతీయ రాష్ట్ర సమితి అనుదీప్, సిపిఐ ఎస్ శ్రీనివాస్, సిపిఎం ఏ సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ , నోముల రమేష్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ. రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :