తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు.న్యాయవ్యవస్థకు రజాక్ చేసిన సేవలు అజరామరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. న్యాయవ్యవస్థకు, బాధితులకు న్యాయం అందించే ప్రక్రియలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎండి రజాక్ చేసిన సేవలు అజరామరమని, ఆయన మృతి న్యాయరంగానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎండి రజాక్ (65) అనారోగ్యంతో మృతి చెందగా, గురువారం చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈ సందర్భంగా రజాక్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి అశ్రునయనాల మధ్య నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృత్తిధర్మానికి కట్టుబడి సమాజంలో పేదలకు, బాధితులకు న్యాయపరమైన సేవలు అందించడంలో రజాక్ ఎల్లప్పుడూ ముందుండేవారని ఆయన గుర్తుచేశారు. నివాళులర్పించినవారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు నయీమ్ ఖురేషి, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ