Thursday, 02 July 2026 04:24:30 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు.

Date : 19 June 2026 07:30 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు.జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆర్&ఆర్, ఇర్రిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలంలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం బీజీ కొత్తూరులోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారుఈ సందర్భంగా జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, అటవీ అనుమతులు, సర్వే పనులు, కోర్టు కేసుల పురోగతిపై ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులకు న్యాయమైన పరిహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవార్డుల జారీ మరియు పరిహారం చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫేజ్–1 కింద 1,522 ఎకరాల భూసేకరణకు గాను మొత్తం అవార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఫేజ్–2లో 2,365 ఎకరాలకు అవార్డులు జారీ చేసి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఫేజ్–3లో 1,621 ఎకరాలకు గాను 1,350 ఎకరాలకు అవార్డులు జారీ చేయగా, 903 ఎకరాలకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన భూములకు సంబంధించి ప్రభుత్వ నిధులు అందిన వెంటనే పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు–1, 2, 6లకు సంబంధించిన భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు.అలాగే సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిని కమిషనర్‌కు వివరించారు. భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌డీఎల్‌సీలు రవీంద్రనాథ్, వెంకట్రావు, మండల తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు రమేష్, యాసీన్ పాషా తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :