తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 15 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ విస్తృతంగా పర్యటించారు. మాచినేనిపేట తండా, పడమట నర్సాపురం, మాచినేనిపేట, జూలూరుపాడు గ్రామాలలొ ఇంకుడు గుంటల నిర్మాణ పనులను పలుచోట్ల పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడిన కలెక్టర్ ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపడతామన్నారు. కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి విద్యాచందన మేడం,ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఏవో దీపక్ ఆనంద్, ఎంపీఓ తులసీరామ్, ఏపీఎం సత్యనారాయణ రాజు, ఏపీవో రవికుమార్ హాజరయ్యారు తదుపరి మండల పరిధిలోని మాచినేని పేట పంచాయతీ గోపాతండా గ్రామంలో రైతు వేసిన మునగ పంటను సందర్శించారు
Admin
తెలుగు వెలుగు టీవీ