Thursday, 17 September 2026 11:35:52 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పేద ప్రజలపై మైక్రో ఫైనాన్స్ ల వేధింపులు ఆపాలి,AITUC జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య

Date : 01 July 2025 01:56 PM Views : 779

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 1 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ లపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు కట్టమని ఇబ్బందులకు గురి చేస్తే గ్రామాల్లో అడ్డుకుంటామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య హెచ్చరించారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల రక్తం తాగుతున్నారని , కట్టకపోతే క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిరుపేదలను బెదిరిస్తున్నారని, వారిని గ్రామాల్లో రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు, 40 .సంవత్సరాలగా అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ ,మోడీ నిరంకుష విధానానికి వ్యతిరేకంగా జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య పిలుపునిచ్చారు. మంగళవారం జూలూరుపాడు లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ కార్మికులకు ఈరోజు హక్కులుగా ఏ చట్టాన్ని కూడా ఏ ప్రభుత్వము దయతోను, ఇష్టంతోనో చేయలేదన్నారు.ఆ చట్టాలన్నీ కార్మికులు తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్నవని వారు గుర్తు చేశారు. అటువంటి చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావాల్సిన అవసరమేంటన్నారు. నిజంగా మోడీకి కార్మికుల మీద అంత ప్రేమ ఉంటే, వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉన్న కార్మిక చట్టాలను పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. కానీ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తొలగించి యాజమాన్యానికి అనుకూలంగా ఉండే లేబర్ కోడ్ లను తీసుకువచ్చి తన వక్ర బుద్ధి చూపించారన్నారు. 2014- 19, మరియు 2019 నుండి 24 మధ్యలో మోడీ ప్రభుత్వం సంఘటిత సంఘటితంగా కార్మికుల కొరకు ఖర్చు చేసిన మొత్తం లక్ష కోట్లు కూడా లేదన్నారు. పది సంవత్సరాల కాలంలో లక్ష కోట్లు కూడా లేవంటే సంవత్సరానికి కేవలం పది వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. కానీ ఇదే సందర్భంలో 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల శక్తులకు 16 లక్షల 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంపద సృష్టికర్తల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ లెక్కలే తెలియ చెబుతున్నాయన్నారు. ఎంపీల జీతాలు పెంచుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనం రోజుకు 375 రూపాయలకు దానిని 90 కుదిరించడం దారుణమైన విషయమన్నారు. నరేంద్ర మోడీ చెప్తున్నట్లుగా లేబర్ కోడులు అమల్లోకి వస్తే వారి జీవితం ఎట్టి పరిస్థితుల్లో బాగుపడదని, వాటి సారాంశాన్ని ఒకసారి పరిశీలిస్తే కార్మికులను ఏ విధంగా దోపిడీ చేయాలో, వారి బతుకులను రోడ్లమీదకు ఏ విధంగా తేవాలో స్పష్టంగా తెలియచెప్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికుల ఉపాధి కొరకు ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై కూడా మోడీ శీతకన్ను వేశాడన్నారు. . కార్మికుల హక్కుల సాధనకై జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి సంఘటిత అసంఘటిత రంగా కార్మికులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఏఐటీయూసీ నాయకులు గుడిమెట్ల సీతయ్య, ఎస్.కె చాంద్ పాషా, వల మల్ల సామేలు, నిమ్మటూరి లచ్చయ్య, పానుగంటి మహేష్, గార్లపాటి వీరభద్రం, బాపట్ల పూర్ణ చందర్రావు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :