తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పోటీ ప్రపంచంలో విద్యార్థులు పుస్తకాల పురుగులుగా మారుతున్నారని,అలా కాకుండా సాంస్కృతిక పోటీల్లో,క్రీడల్లో రాణించినప్పుడే వారు మానసిక ఉల్లాసంగా ఉంటారని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.కొత్తగూడెం పట్టణంలోని రైల్వే ఫంక్షన్ హాల్ నందు కొత్తగూడెం ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సూపర్ డాన్స్ సీజన్ -10 పోటీలకు ముఖ్య అతిథిగా కామేష్ హాజరై డాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం పుస్తకాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు.ఇలా చేయడం వల్ల వారిలో దాగి ఉన్న కళలను బయటకు తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అలా కాకుండా ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి,వారికి తగిన శిక్షణను ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు.డాన్స్ పోటీలకు విచ్చేసిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు.ఎలాంటి బెరుకు లేకుండా చిన్నారులు అద్భుతంగా తమ నృత్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.కొత్తగూడెం కళాకారులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.సూపర్ డ్యాన్సర్ 1వ సిరీస్ వల్లే 10 సిరీస్ పోటీలు చాలా చక్కగా నిర్వహించిన డాన్స్ మాస్టర్ ప్రభురాజ్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈకార్యక్రమంలో తెరాలా లక్ష్మీ వీరభద్రం, భవాని, ఆలీ, పుష్కల్, కమల్, కృష్ణ, యాకూబ్, వినయ్, గోవింద్, క్రాంతి కుమార్, శ్రీను, పూల రవీందర్, శ్యామ్, ప్రవీణ్, పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ