Wednesday, 16 September 2026 04:44:41 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా.

Date : 10 September 2026 06:40 PM Views : 54

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి టివిఆర్ చంద్రం చేసిన కృషి చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఉన్నారు. టివిఆర్ చంద్రం 20వ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్లో ఎగరేసిన ఎర్రజెండా పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పాషా మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో టివిఆర్ చంద్రం చేసిన పోరాటాలు నేటికీ చిరస్కరణీయం అన్నారు. కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో గిరిజనులు, కార్మికులు బలహీన సబ్బండ వర్గాల ప్రజల మేలు కోసం ఆయన నిర్మించిన పోరాటాలు కమ్యూనిస్టు ఉద్యమానికి మైలురాయిగా మిగిలాయని చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజాపోరాటల చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని, ఇది ముందు తరానికి స్పూర్తి దాయకంగా నిలుస్తుందని చెప్పారు. ప్రజలకష్టాలను స్వయంగా తెలుసుకుని వారిని సమీకరించి ఉద్యమాలు నిర్మించారన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి ప్రత్యేకమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పేదలు గిరిజనులు కార్మిక సమస్యలపై ఐఖ్యంగా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. టివిఆర్ చంద్రం చూపిన ప్రజా ఉద్యమ పోరాటాన్ని నేటితరం కొనసాగించడమే ఆయనకిచ్చే నిజ నిజమైన నివాళి అని షాబీర్ పాషా అన్నారు. సిపిబ ఖమ్మం జిల్లాకార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం నాయకులు బి వెంకట్, బండారు రవికుమార్, ఎలమంచిలి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :