Friday, 18 September 2026 11:55:33 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సంక్షోభంలో విద్యారంగం విద్యను అట్టడుగు వర్గాలకు దూరం చేస్తున్న ప్రభుత్వాలు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 16 October 2024 06:11 PM Views : 457

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల అట్టడుగు కులాల,అట్టగుడు వర్గాల విద్యార్దులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని బహజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ విమర్శించారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నదని ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూస ధోరణిని అవలంబిస్తున్నదని,విద్యారంగానికి 15 శాతం నిధులను కేటాయిస్తామని మ్యానిపెస్టోలో ప్రకటించి బడ్జెట్ లో కేవలం 7.3 శాతం నిధులను మాత్రమే కేటాయించిందని,అదేవిదంగా 2014 బడ్జెట్ లో విద్యారంగానికి కేంద్రంలోని మోడీ సర్కార్ 6 శాతం నిధులను కేటాయించగా..2024 నాటికి అవి 2.5 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న సుమారు 30 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పించి,వాటిని అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపిస్తామని,మండలానికో సమీకృత పాఠశాలను ఏర్పాటు చేస్తామంటూ కాలయాపన చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత పది నెలల కాలంలో విద్యారంగంలో వచ్చిన,వస్తున్న మార్పులు ప్రభుత్వ విద్యను బలహీన పర్చేలా ఉన్నాయని,పేదలకు,మధ్యతరగతికే కాకుండా ఎగువ మధ్యతరగతి వారికి కూడా విద్యను దూరం చేసే విధంగా ఉన్నాయని వీటి వల్ల అభ్యాసన సంక్షోభం ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :