Wednesday, 16 September 2026 09:53:19 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రజలకు వివాదం లేని భూ రికార్డులను అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Date : 04 September 2026 10:56 AM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలకు వివాదం లేని భూ రికార్డులను అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే.. ప్రతి రైతుకు జియో కోఆర్డినేట్లతో భూమి మ్యాప్ భూ రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం రీ-సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. సక్రమంగా పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలపై సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి ప్రజలకు ఎలాంటి వివాదాలు లేని భూమిని అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలకు సంబంధించిన అంశాలపై మండల స్థాయి వరకు అధికారులతో, ప్రజాప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ భూ వివాదాల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, శాసనసభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా భూ రీ-సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే: భూ రీ-సర్వేలో భాగంగా తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి, నవంబర్‌ 2026 నాటికి ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రీ-సర్వే నిర్వహిస్తున్నామని, ప్రతి రైతుకు వారి భూమికి సంబంధించిన జియో కోఆర్డినేట్లతో కూడిన మ్యాప్‌ను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 125 సంవత్సరాల క్రితం సర్వే జరిగిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న భూ రీ-సర్వే ద్వారా దాదాపు అన్ని భూ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇప్పటికే సుమారు 25 శాతం గ్రామాలు రీ-సర్వేలో వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ చివరి నాటికి రీ-సర్వే ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 1,750 సర్వే యంత్రాలతో రీ-సర్వేకు వేగం: రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 950 సర్వే యంత్రాలను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. మరో 800 యంత్రాలను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తొలి విడత రీ-సర్వేలో ఎదురయ్యే సమస్యలు, అధికారులు పొందే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో సర్వే ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: హౌసింగ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో భాగంగా తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో ప్రతి నియోజకవర్గ పరిధిలో వివిధ కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లను గుర్తించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :