Thursday, 17 September 2026 09:34:39 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎఐటియుసి పోరాట ఫలితంగా రామవరం డిస్పెన్సరీ పునఃప్రారంభం

Date : 20 July 2026 03:05 PM Views : 274

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎట్టకేలకు రామవరంలో డిస్పెన్సరీ ప్రారంభించిన డైరెక్టర్ (పీపీ), ఏరియా జీఎం, ప్రధాన ఆసుపత్రి సీఎంఓ. గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం ఉదయం పునఃప్రారంభించింది.ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ.రామవరం డిస్పెన్సరీని యథావిధిగా కొనసాగించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతూ ఈ ఏడాది మే 31న ప్రధాన ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి (సీఎంఓ) డా. కిరణ్ రాజ్, ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజుకు ఎఐటియుసి నాయకులు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.ఎఐటియుసి చేసిన నిరంతర కృషి, యాజమాన్యంపై తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగానే రామవరం డిస్పెన్సరీ తిరిగి ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా ఒక నర్సు, ఒక వార్డ్ బాయ్‌ను మరియు ఆయను నియమించి, బీపీ, షుగర్ తో పాటు సాధారణ మందులను అందుబాటులో ఉంచి సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులకు ఈ డిస్పెన్సరీ ఎంతో అవసరమైన వైద్య సేవలను అందిస్తోందన్నారు. అయితే డిస్పెన్సరీ ప్రారంభించినంత మాత్రాన సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు కాదని, వెంటనే శాశ్వత వైద్యుడిని నియమించి, అవసరమైన వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడంతో పాటు తగిన మందుల నిల్వలు అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన డైరెక్టర్ (పీపీ) కే. వెంకటేశ్వర్లు త్వరలోనే వైద్యుడితో పాటు అవసరమైన సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిస్పెన్సరీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేసి పునఃప్రారంభానికి సహకరించిన ఏరియా జనరల్ మేనేజర్, ప్రధాన ఆసుపత్రి సీఎంఓలకు ఎఐటియుసి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఉపాధ్యక్షుడు కత్తెర్ల రాములు, నాయకులు హుమాయూన్, మండల రాజేశ్వరరావు, మల్లికార్జున్, అప్పారావు, సీపీఐ నాయకులు కంచర్ల జములయ్య, కార్పొరేటర్ శంకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :