Tuesday, 03 November 2026 08:09:31 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మెగా ఆధార్ క్యాంపులకు ప్రజల నుండి విశేష స్పందన : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 18 July 2025 06:59 PM Views : 633

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఆధార్ క్యాంపులకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 9 నుండి జూలై 17, వరకు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపుల్లో మొత్తం 6,159 మంది తమ ఆధార్ నమోదు, సవరణలు వంటి సేవలను పొందారని తెలిపారు. ఇందులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన క్యాంప్‌లో అత్యధికంగా 3,772 మంది, భద్రాచలం క్యాంప్‌లో 801 మంది, ఇల్లందులో 714 మంది, మణుగూరులో 525 మంది, దమ్మపేటలో 347 మంది పాల్గొన్నారు. అన్ని క్యాంపులకు కలిపి మొత్తం 3,500 ఫిర్యాదులు స్వీకరించబడి పరిష్కారానికి చర్యలు చేపట్టబడ్డాయి అన్నరు. ప్రజలు ఇంకా ఆధార్ సవరణలు లేదా ఆధార్ ఆధారిత సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలి అంటే తమ మండలాల్లోని ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం దుమ్ముగూడెం, చర్ల, గుండాల, దమ్మపేట, మణుగూరు, భద్రాచలం, ఇల్లందు, టేకులపల్లి, ముల్కలపల్లి, అన్నపూరెడ్డిపల్లి, అశ్వాపురం పినపాక, కరకగూడెం, కొత్తగూడెం, పాల్వంచ,సుజాత్‌నగర్,చండ్రుగొండ,జూలూరు‌పాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి వంటి మండలాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు పంచాయతీ కార్యాలయాలు, MPDO కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు మరియు స్కూల్ ఆధార్ టీంలు ద్వారా లభిస్తున్నాయి. కొన్ని మండలాల్లో త్వరలో ఆధార్ సేవలు ప్రారంభమవుతాయనీ అధికారులు తెలిపారు. స్కూల్ ఆధార్ టీమ్‌కు సంబంధించి ఏవైనా వివరాలు కావాలంటే జిల్లా మేనేజర్ వంశీ (ఫోన్ నంబర్: 7331115024)ను సంప్రదించవచ్చు. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే – మీ ఆధార్ మీ హక్కు. అందుచేత అవసరమైన అప్డేట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి అని ఆధార్ సేవలపై ఫిర్యాదులు, సలహాల కోసం UIDAI హెల్ప్‌లైన్ నంబర్ 1947 లేదా ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావును కలెక్టరేట్‌లో సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :