తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 6 తెలుగు వెలుగు ) జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలంగాణ సిద్ధ్దాంతకర్త, ఉద్యమ భావ జాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ మలి దశ ఉద్యమానికి దిక్సూచిగా తెలంగాణ జన హృదయాల్లో నిలిచిన ఆయన రాష్ట్ర సాధనకు కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారని సభాముఖంగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు
Admin
తెలుగు వెలుగు టీవీ