Thursday, 17 September 2026 03:56:24 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్

Date : 17 September 2025 11:34 AM Views : 414

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను ప్రారంభించిన ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని, చిన్నతనంలో సంగీత ఉపాధ్యాయురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోయానని, కానీ నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్తు ఆకర్షణీయంగా ఉంటుందని సూచించారు. పిల్లలందరూ తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించే ఒక మార్గమే ఇటువంటి పోటీలను పిల్లలకు ఉద్బోధించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి. నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తీపి జ్ఞాపకాలను తమతో తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పోటీలలో సుమారు రెండు వందల మంది పిల్లలు 12 రకాలైన కళారూపాలను రెండు రోజులపాటు ప్రదర్శించనున్నారని, అందులో భాగంగా మొదటి రోజు శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, థియేటర్ ఆర్ట్, విజువల్ ఆర్ట్స్ 2D, 3D అంశాలలో పోటీలు నిర్వహించనున్నామని, రెండవ రోజు గాత్ర సంగీతం, వాద్య సంగీతం, కథలు చెప్పటం అంశాలలో పోటీలను నిర్వహించనున్నామని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజు శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, సైదులు, వివిధ పాఠశాల నుండి వచ్చేసిన విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటిరోజు విజేతల వివరాలు: థియేటర్ ఆర్ట్స్: ప్రథమ బహుమతి: నవభారత్ పబ్లిక్ స్కూల్ పాల్వంచ, ద్వితీయ బహుమతి: పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల పాల్వంచ. విజువల్ ఆర్ట్స్ -2D ప్రథమ: వి. అంశీత, నవభారత పబ్లిక్ స్కూల్, పాల్వంచ ద్వితీయ: N. నిశిత సాయి, BPL school,, బూర్గంపహాడ్ శాస్త్రీయ నృత్యం: ప్రథమ: ఎం. ధవళ, త్రివేణి స్కూల్, లక్ష్మీదేవిపల్లి ద్వితీయ: పి ఖ్యాతి క్రిపిత, కృష్ణవేణి జూనియర్ కాలేజీ, కొత్తగూడెం. వీరికి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి బి. నాగలక్ష్మి బహుమతులు అందజేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :