Wednesday, 16 September 2026 06:05:52 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎస్‌.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 31 October 2025 06:15 PM Views : 406

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్‌ (ఎస్‌.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్టరింగ్ ఆఫీసర్లు (AEROs), బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) మరియు బిఎల్ఓ సూపర్వైజర్లతో ఎస్‌.ఐ.ఆర్ పూర్వ సన్నాహక ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను పారదర్శకంగా, తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలని, నిర్దిష్ట రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బిఎల్ఓలు బాధ్యతాయుతంగా పని చేసి, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో తప్పకుండా ఉండేలా నిశిత పరిశీలన జరపాలని సూచించారు.002 సంవత్సరపు ఓటరు జాబితాను 2025 సంవత్సరం జాబితాతో మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు గుర్తు చేశారు. ముందుగా మ్యాపింగ్ చేయబడిన కేటగిరి ‘ఏ’ జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా ధృవీకరించి, అది ఎన్నికల సంఘం పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కేటగిరీ ‘సి’ మరియు కేటగిరీ ‘డి’ లోని ఓటర్లను ‘ఏ’ కేటగిరీకి మ్యాపింగ్ చేసే ప్రక్రియను ఎఇఆర్ఓల ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలు బిఎల్ఓ యాప్ ద్వారా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, ప్రజా పాలన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన సాదా బైనామా మరియు అసైన్డ్ భూముల పెండింగ్ దరఖాస్తులను నవంబర్ 3వ తేదీ లోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు పరిష్కరించిన దరఖాస్తులపై వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలనీ, తిరస్కరించిన దరఖాస్తులపై తగిన కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :