Friday, 18 September 2026 05:13:19 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సీతారామ ప్రాజెక్టు కాల్వ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ MLA కి వినతి పత్రం

Date : 29 October 2024 04:28 PM Views : 1157

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 29(తెలుగు వెలుగు) జులూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన లంబాడీ గిరిజన రైతులకు సీతారామ ప్రాజెక్టు కాల్వ కింద పోడు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ మంగళవారం వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసారు.ఎలకలోడ్డు గ్రామ సమీపాన 17 మంది రైతులు ఉమ్మడిగా గత 20 సంవత్సరాల క్రితం పోడు భూములు సాగు చేసుకుని జీవిస్తున్నాంమని,అట్టి పొడు భూములు సీతారామ ప్రాజెక్టు కాలువ కింద కోల్పోయామని,ప్రభుత్వం వారు మాకు ఎటువంటి నష్టపరిహారాన్ని అందించలేదని రైతులు విన్నవించారు.భూములు కోల్పోయిన మాకు నష్టపరారాన్ని అందించాలని కోరుతూ అనేకసార్లు సంబంధిత అధికారులకు, సీతారామ ప్రాజెక్టు ఎస్ డి సి పాల్వంచవారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పెట్టుకున్నా మా గోడు పట్టించుకోలేదని రైతులు ఆపోయారు. గతంలో భూములకు పట్టా హక్కు కల్పించాలని కోరుతూ ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకున్నామని, ఎఫ్ఆర్సి కమిటీ సమావేశం జరిగిన సందర్భంగా కాల్వ కింద భూమి కోల్పోయిన మా భూములకు నష్టపరిహారం అందించాలని కోరినామని తెలిపారు.ఎఫ్ఆర్సి కమిటీ కూడా మా భూములకు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారని, కాల్వ పనులు మొదలు పెట్టడం వల్ల సర్వేకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఎఫ్ఆర్సి కమిటీ సర్వే చేయలేదని రైతులు ఎమ్మెల్యే కి వివరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కాలువ కింద కోల్పోయిన మా భూములను సమగ్రంగా సర్వే చేయించి, రైతులకు నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. అందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో సంప్రదించి నష్టపోతున్న రైతులకు తక్షణమే నష్టపోయారాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా నాయకులు ఎదులాపురం గోపాలరావు, బానోతు ధర్మ, మండల నాయకులు బాదావత్ జవహర్లాల్, భూక్యా లోక్య గ్రామ రైతులు బానోతు బాలు, గుగులోతు బీమా, భూక్య సక్రు, బాదావత్ బోడకా, నునావత్ సరోజిని, గుగులోతు రమణి, బాదావత్ స్వప్న, చిన్న, స్వామి, రాములు, రమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :