తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా గురువారం ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, డి ఎల్ ఎం టి సాయికృష్ణ, పొలిటికల్ పార్టీ నోముల రమేష్ బిజెపి, కాంగ్రెస్ పార్టీ, జయ శ్రీలక్ష్మి, హమ్ ఆప్ ది పార్టీ రాంబాబు, సిపిఎం పార్టీ ఎల్ బాలరాజు, ఏ సత్యనారాయణ ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ