తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 3 తెలుగు వెలుగు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని ఏడుగురు వ్యక్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన జూలూరుపాడు మండలం బేతాళ పాడు గ్రామపంచాయతీ రేగళ్ల తండా లో చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా విడుదల కాగా అందులో తమ పేర్లు లేవని గ్రామానికి చెందినబాణోత్ కళ్యాణ్, దారావత్ నాగమణి,దారావత్ నర్శింహారావు, దారవత్ బాలు,చౌడం వెంకటేశ్వర్లు, బాణోత్ కవిత, బాణోత్ సునీత బాణోత్ బిందులు. నిరసన వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో గ్రామస్తులంతా ఆందోళన చెందారు. గ్రామస్తులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు నచ్చజెప్పడంతో సదరు వ్యక్తులుకిందికి దిగారు.
Admin
తెలుగు వెలుగు టీవీ