Wednesday, 16 September 2026 08:31:22 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి: ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా.

Date : 09 October 2025 06:41 PM Views : 304

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గెరిల్లా పోరాట యోధుడు ఎర్నస్టో చేగువేరా:సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం: గెరిల్లా పోరాట యోధుడు, ధైర్యశాలి,మూర్తీభవించిన మానవత్వం వంటి విలువలు కలిగిన మహనీయుడు ఎర్నస్టో చేగువేరా అని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా అన్నారు. చేగువేరా 58వ వర్ధంతిని ఏఐవైఎఫ్ భద్రాది కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో శేషగిరి భవన్లో ఏర్పాటుచేసిన చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.చేగువేరా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని... మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలన్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, వారిని విప్లవోద్యమం వైపు మళ్ళించకుండా విప్లవాన్ని విజయవంతం చేయడం అసాధ్యమని చే అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. రైతాంగం, కార్మిక వర్గం అనే రెండు పట్టాలమీద విప్లవమనే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, తడిమట్టి ముద్ద, మార్క్సిజం మౌళిక భావనలు రెండూ ఒక్కటే అన్నారు. కుమ్మరి కళాకారుని చేతుల్లో ఆ చక్రం మీద మనిషి అవసరం కోసం వివిధ ఆకృతుల్ని రూపొందించినట్లుగా ఆయా సమాజాల భౌతిక పరిస్థితుల్ని బట్టి మార్క్సిజాన్ని అన్వయించుకోవచ్చన్నారు.ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, సైద్ధాంతిక విభేదాలున్నా అంతిమంగా ప్రజల విముక్తే విప్లవకారుడి ధ్యేయం కావాలన్నారు.విత్తు నాటే ముందు వాన కురవాలి... పిడుగు పడే ముందు ఉరుము గర్జించాలి... ఒక విప్లవానికి ముందు త్యాగాలు జరిగి తీరాలని చే వ్యాఖ్యలు అనేక పోరాటాలకు అద్దం పడుతుందన్నారు. క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని, ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, భూపేష్, జావీద్, కొచ్చెర్ల రాకేష్,రణధీర్, ఇర్ఫాన్, నాదీమ్, అజయ్,రవి, విజయ్ కాంత్, త్రినేష్, షారుఖ్, సోహెల్, సంతోష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :