Thursday, 02 July 2026 05:26:14 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

జిల్లా గ్రంధాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 November 2024 06:31 PM Views : 537

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థుల కు కల్పిస్తున్న సౌకర్యాలు,గ్రంథాలయం లో పుస్తకాలు చదువుకోవటానికి గాను శాశ్వత సభ్యత్వం ఎంత, విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను రిజిస్టర్ మైంటైన్ చేస్తున్నారా లేదా తదితర వివరాలను గ్రంథాలయ అధికారిని అడిగి తెలుసుకున్నారు.గ్రంథాలయంలో స్టోర్ రూమ్ లోని పుస్తకాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ కురుస్తుందా, మరుగుదొడ్లు, ఫ్యాన్లు లైట్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయని ఆరా తీశారు.పుస్తకాలకు ఇన్ వర్డ్ నెంబర్ ఉన్నదా లేదా అని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో ఎంతో విలువైన మరియు పురాతనమైన పుస్తకాలు ఉన్నాయని, వాటిని సరైన పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. గ్రంథాలయంలో పుస్తకాలు భద్రపరచడానికి గాను గోడకి అలమారాలు ఏర్పాటు చేయాలని, పుస్తకాలు శుభ్రపరచడానికి వ్యాక్యూమ్ క్లీనర్ లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కొత్తగూడెం తెలంగాణ భవన్ ప్రక్కన నూతనంగా నిర్మించిన గ్రంథాలయభవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పుస్తకాలు చదివేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రంధాలయంలో పుస్తకాలను పోటీ పరీక్షలు, గ్రంధాలు, నవలలు తదితర వాటిని విభజించి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.నూతన గ్రంథాలయంలో మిషన్ భగీరథ అధికారుల ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసి సంపు ద్వారా తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సుదూరం నుండి విద్యార్థులు చదువుకోవడానికి గ్రంథాలయానికి వస్తారని, మహిళా సంఘాల ద్వారా వారికి అందుబాటులో 20 రూపాయలకే భోజనం క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రంథాలయ వార్షికోత్సవల సందర్భంగా విద్యార్థులు మరియు యువత పెద్ద ఎత్తున గ్రంథాలయాలకు వచ్చి మన పురాతన గ్రంథాలను, పుస్తకాలను చదివి వాటి యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి, జిల్లా గ్రంథాలయ అధికారి ఏం నవీన్ కుమార్, లైబ్రేరియన్ శ్రీమతి. జి. మృదులామణి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :