Saturday, 19 September 2026 06:50:22 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర చర్యలు చేపట్టాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్.

Date : 30 May 2026 08:09 PM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుండి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారుఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా స్నాన ఘాట్‌ల అభివృద్ధి, రహదారి సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్నాన ఘాట్‌ల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో చేపట్టాల్సిన పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అందిన ప్రతిపాదనల మేరకు ప్రాధాన్యత పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఇరిగేషన్, ఆర్ & బి, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ద్వారా చేపట్టనున్న పనులను వివరించారు. ఘాట్‌ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం తదితర పనులకు సంబంధించి ఆయా శాఖల ద్వారా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినట్లు తెలిపారు. అదనంగా అవసరమైన రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు .ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్ రావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :