తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రికొత్తగూడెం నవంబర్10(తెలుగువెలుగు) జూలూరుపాడు లో కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి మరియు కేరళ రాష్ట్ర ఇన్చార్జి గోలి మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తాం, సంవత్సరానికి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా రైతుల నోట్లో మన్ను కొట్టింది. రైతులు ప్రైవేటుగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పంటకు పెట్టుబడి పెడితే, సరైన దిగుబడి రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అన్ని పంటలకు మద్దతు ధరపై 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఈరోజు కేవలం సన్న ఒడ్లుకు మాత్రమే బోనస్ ఇస్తానని చెప్పడం ఇది రైతులను మోసం చేసినట్టే సన్న ఒడ్లుకు ఎక్కువ రేటు పెట్టి బయట మిల్లర్లే కొనుగోలు చేస్తారు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏముంటది, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర 2321 రూపాయల ధర చెల్లిస్తుంది ,అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెటింగ్ చేసి ఎందుకు బస్తా ఖరీదు, పూరి కోస ధర, మిల్లు ఆడించినందుకు, ట్రాన్స్పోర్ట్ కు, గోడం అద్దెకు మూడు నెలల వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెటింగ్ చేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ కూడా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది, మిల్లర్లు దళార్లు కలిసి రైతులని దోచుకుంటున్నారు ,కేంద్ర ప్రభుత్వం పామాయిలకు పదివేల 400 రూపాయలు సబ్సిడీ రైతులకు చెల్లిస్తుంది ,అదే కాకుండా ఉపాధి హామీ నిధులు మరియు గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు రేట్లు పెరుగుతున్న కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ మూలపడిన ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిపించి ఈరోజు రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేసినది రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోతే బిజెపి ఆధ్వర్యంలో డిసెంబరు ఒకటో తారీఖున నుంచి తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని బిజెపి బృందాలు పర్యటన చేస్తున్నాయి ,కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని చేపడతామని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ ,నున్న రమేష్, తెల్లం నరసింహారావు, సిరిపరపు గోపాలరావు, వందనపు సుబ్బు, నిమ్మటూరి రామారావు, నాగేశ్వరరావు మరియు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ