Wednesday, 16 September 2026 12:18:52 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్. కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 06 September 2026 05:03 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్.జిల్లా వ్యాప్తంగా 1216 దరఖాస్తులు.. 1030 మంది అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు.కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా ఈ ఉచిత శిక్షణ కోసం 1216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1030 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.జిల్లాలోని ఐదు సబ్‌-డివిజన్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం సబ్‌-డివిజన్‌లో సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పాల్వంచ సబ్‌-డివిజన్‌లో అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్, ఇల్లందు సబ్‌-డివిజన్‌లో గవర్నమెంట్ హై స్కూల్ (జె.బి.ఎస్.), మణుగూరు సబ్‌-డివిజన్‌లో శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్, భద్రాచలం సబ్‌-డివిజన్‌లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులకు సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులకు కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచే విధంగా సమగ్ర శిక్షణ, అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని పేర్కొన్నారు.పోలీస్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పాటు క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవచ్చని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణలో చురుకుగా పాల్గొని, నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో సబ్‌-డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :