తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.26 లక్షల విలువైన సొత్తు స్వాధీనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ లలో చైన్ స్నాచింగ్, బైక్స్ చోరీ చేసే ముఠా ను జిల్లా పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు.దీనికి సబంధించి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో వివరాలు వెల్లడించారు.వివరాలు ఇలా ఉన్నాయి.6 బంగారు గొలుసులు(150 గ్రాములు) , మూడు బైకులు,1 కట్టర్,7 సెల్లఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ముందుగా బైక్స్ చోరీ చేసి ఆ బైక్స్ పై వెళ్లి చైన్ స్నాచింగ్ చేస్తారు.అశ్వారావుపేట కు చెందిన ప్రధాన సున్నం నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ చోరీ లు చేస్తున్నారు.ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు..మరో నిందితుడు పరారీలో ఉన్నాడు
Admin
తెలుగు వెలుగు టీవీ