తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణం గాజులరాం బస్తి 58 వ డివిజన్లో సెంట్రల్ లైటింగ్ కొరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున యాక్సిడెంట్లు అవకాశం ఉంది, కావున అట్టి ఆక్సిడెంట్లను నివారించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశాలు మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆధ్వర్యంలో డేంజర్ సైన్ బోర్డులను 58వ డివిజన్ సిపిఐ కార్యదర్శి కొచ్చర్ల రాకేష్ కాంత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామ్ చందర్,గజిగంటి రవి, ఎస్ డి బర్కత్, త్రినేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ