Wednesday, 16 September 2026 09:47:38 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 30 July 2025 04:53 PM Views : 615

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని జగన్నాధపురం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు ఓపీ, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ గదులను పరిశీలించారు.అనంతరం ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరును పరిశీలించి, విధి నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శించకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులను పర్యవేక్షిస్తూ , వారికి అందుబాటులో ఉన్న మందుల గురించి తెలుసుకున్నారు. రోగులతో ప్రత్యక్షంగా మట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? మందులు ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పట్ల అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది అని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలని ఆదేశించారు. అన్ని రకాల అవసరమైన మందులు, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా స్టాక్ పూర్తయ్యేలోపే ముందుగానే ఇండెంట్ చేసి తెప్పించుకోవాలని సూచించారు. ఎక్స్‌పైర్ అయ్యే ఔషధాలపై అప్రమత్తంగా ఉండాలని, అవి ఆసుపత్రిలో నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రత్యేకంగా వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్ల చికిత్సకు అవసరమైన మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. గర్భిణీల వివరాలు నిబంధనల ప్రకారం ఆన్లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.అంతేకాకుండా, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట డాక్టర్ రాజు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :