Wednesday, 04 November 2026 07:17:49 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు – పాల్గొన్న అదనపు కలెక్టర్ మరియు శిక్షణ కలెక్టర్

Date : 23 September 2025 08:24 PM Views : 432

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా సంబరాల్లో భాగంగా మూడవ రోజు జరుపుకునే ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ , శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ హాజరై, మహిళా ఉద్యోగులతో కలిసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పూజలో పాల్గొని ఆడి, పాడారు. సంప్రదాయం ప్రకారం చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం వంటి పూలతో మూడంతరాలలో బతుకమ్మను నిర్మించి, తామర పాత్రల్లో కళాత్మకంగా అలంకరించడం జరిగింది.మహిళా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పూలతో బతుకమ్మను అందంగా అలంకరించడమే కాకుండా భక్తి భావంతో నృత్యాలు, ఆడిపాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం మరింత రసవత్తరంగా సాగింది.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల సాంఘిక ఐక్యత బలపడుతుందని పేర్కొన్నారు. అలాగే ముద్దపప్పు బతుకమ్మ సమర్పణ ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సుకు దోహదం చేస్తుందనే విశ్వాసాన్ని అన్నారు. శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ , ఇటువంటి పండుగలు ఉద్యోగుల మధ్య సఖ్యత, సామరస్య వాతావరణాన్ని పెంచుతాయని, కార్యాలయ వాతావరణంలో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా, వైద్య శాఖ సిబ్బంది, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :