తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టాస్ వేసి పోటీలు ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీ, బాడ్మింటన్ క్లబ్ లో జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను టోర్నీ నిర్వాహకులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరై టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ బ్యాట్మెంటన్ ఆట వల్ల సమయస్ఫూర్తి , శరీర దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని , నేడు అవుట్ డోర్ గేమ్స్ తో పాటు ఇండోర్ గేమ్స్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవి కుమార్ ,ట్రెజరర్ కె. రమేష్, ప్రోగామ్ చైర్మన్ గోనేల నాని, కమిటీ సభ్యులు రాజ్ కుమార్ , జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు కరీంపాషా, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్ , ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్ మరియు క్రీడాకారులు ????️ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ