తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : ఇల్లందు మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన ముక్తి వీరమ్మ (55) ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ