తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం: పవన్ ఏపీకి నిన్న ప్రకటించిన కోటి విరాళానికి మరింత అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రూ.కోటి తో కలుపుకొని పవన్ మొత్తంగా రూ.6 కోట్ల విరాళం ప్రకటించడం గమనార్హం.
Admin
తెలుగు వెలుగు టీవీ