తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(తెలుగు వెలుగు) సెప్టెంబర్ 30 ఎస్పీకార్యాలయం లో డిజిపి చేతుల మీదుగా బెస్ట్ ఎంక్వయిరీ ఆఫీసర్ గా ప్రశంసా పత్రాన్నిఅందుకున్న ఏఎస్సై బి.తిరుపతిరావును అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపి ఎస్.వర్టికల్స్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రతిభ కనపరిచిన అధికారులకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర డీజిపి శ్రీ జితేందర్ ఐపిఎస్ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.జిల్లా నుండి జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.తిరుపతిరావు "బెస్ట్ ఎంక్వయిరీ ఆఫీసర్" గా డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈరోజు ఏఎస్ఐ తిరుపతిరావు ని ప్రత్యేకంగా అభినందించారు.పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులను బాధ్యతతో,నిబద్ధతతో నిర్వర్తిస్తే ఎప్పటికైనా తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పిరెహమాన్,జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై రాణాప్రతాప్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ