Wednesday, 16 September 2026 10:55:21 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

Date : 24 June 2026 06:25 PM Views : 212

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్కర సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడాలి.జిల్లా పోలీస్ శాఖ తరఫున DDRF బృందాలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద జరుగుతున్న డిడిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ రోహిత్ రాజు బుధవారం నాడు సందర్శించారు. ​శిక్షణా శిబిరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి అందుతున్న శిక్షణ తీరును పర్యవేక్షించారు. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో డిడిఆర్ఎఫ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డీడిఆర్ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను సంరక్షించడానికి ఈ బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్, బోట్లు,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని శిక్షణ పొందుతున్న బృందాలకు సమకూర్చడం జరిగిందని తెలియజేశారు.విపత్కర సమయాల్లో డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.​ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ ఎల్లయ్య, ఆపరేషన్ ఆర్ఐ బి. రవి, ఎస్ఐ రాజేష్, పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, డిడిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :