Wednesday, 04 November 2026 09:03:23 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఇందిరమ్మ ప్రాణ త్యాగాలు వృథా పోలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి.

Date : 31 October 2025 07:51 PM Views : 442

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మిదేవిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందన్నారు. 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన నాటికి దేశంలో ఆర్థిక మాంద్యం, పారిశ్రామిక ఉత్పత్తుల పతనం, ఎగుమతులు తగ్గడం, ఆహారధాన్యాల సంక్షోభం ఏర్పడ్డాయనీ, వీటితో పాటు బడ్జెట్ డెఫిసిట్ పెరగడం, విదేశీ ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడటం వంటివే గాక 1962, 1965నాటి యుద్ధాలు, పాకిస్థాన్– చైనా కూటమి ఏర్పాటులో సైన్యంపై ఖర్చు పెంచడం వంటివీ జరిగాయన్నారు. వర్షాలు లేక కరువు ఏర్పడిందనీ ధరలు పెరిగాయనీ పాలనా ఖర్చులు తగ్గించుకోవడం వీలుపడలేదనీ అయినా, యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలు సేకరించి, ప్రజలకు పంచి, వారి ప్రాణాలు కాపాడగలిగారన్నారు. ఇందిరాగాంధీ ధైర్య సాహసాలు మరే నాయకురాలు కనిపించవని ‘నా దేశం గొప్పది’ అనే గర్వం ఆమెలో ప్రస్ఫుటంగా కనపడేదని భారత్‌ ఎదగబోయే స్థాయిని అంచనా వేసుకుని ఉప్పొంగిపోయేవారన్నారు. అందుకే దేశ ప్రాధాన్యాలు, దేశ గౌరవం కాపాడ్డంలో ఇందిర రాజీపడేవారు కాదనీ కొనియాడారు. బాడీగార్డ్స్‌ చేతుల్లో 1984 అక్టోబర్ 31న ఇందిర అస్తమించారనీ దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయిందనీ బడుగు, మైనార్టీ ప్రజలంతా తమ ‘అమ్మ’ను కోల్పోయినట్లుగా బాధపడ్డారనీ దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన ఇందిర చిరస్మరణీయురాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడిజగన్, పూనెం శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎండీగౌస్ పాషా, మాజీ సర్పంచ్ తాటి పద్మ, భూక్యా పద్మ, బానోత్ బలరాం నాయక్, బండ వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ మహేష్, మైనార్టీ నాయకులు ఎండీ అఫ్సర్ ఖాన్, షేక్ మతిన్, షేక్ మహబూబ్, దళిత హక్కుల నాయకులు అంతడపుల కృష్ణ, దంసలపూడి శివ, ఉబ్బన రాజు, బహుజన రాజ్యాధికార సాధన నాయకులు ఐకి సత్యనారాయణ, ఏనుగుల వెంగళరావు, గుండ్ల రవి, కొంపెల్లి వీరయ్య, ఆదివాసీ నాయకులు కుంజా సూరిబాబు, చింత రమేష్, తాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :