Saturday, 19 September 2026 06:52:43 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్"ఎయిర్‌పోర్టు"లో కీలక అడుగులు

Date : 04 July 2026 05:39 PM Views : 1849

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : •సీతంపేట, సుజాతనగర్‌లే అనుకూల ప్రాంతాలుగా గుర్తింపు •కేంద్ర మంత్రి రాంమోహన్‌ నాయుడుకు నివేదిక పంపిన మంత్రి తుమ్మల •667 ఎకరాల్లో నిర్మాణానికి అవకాశం... •ఆరు ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాల అధ్యయనం ఖమ్మం: దశాబ్దాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదించిన స్థలాలు సాంకేతిక, ఆర్థిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో, జిల్లా యంత్రాంగం ద్వారా ప్రత్యామ్నాయ స్థలాలపై చేపట్టిన సమగ్ర సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్‌ నాయుడుకు అందజేశారు. ఈ మేరకు జులై 4నమంత్రి తుమ్మల లేఖ రాశారు . గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై గతంలో తాను పంపిన లేఖలను ప్రస్తావిస్తూ, తాజా పరిణామాలను ఇందులో వివరించారు. రెండు పాత ప్రతిపాదనలకు అడ్డంకులు... కొత్తగూడెం సమీపంలో గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాల్లో ఒకటి సాంకేతికంగా, మరొకటి ఆర్థికంగా(భూసేకరణకు) అనుకూలం కాదని తేలడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచన మేరకు జిల్లా యంత్రాంగం స్వతంత్ర సాంకేతిక సంస్థ 'రాజ్‌ టెక్నాలజీస్‌'ను రంగంలోకి దించి, సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలమైన కొత్త స్థలాలను గుర్తించే బాధ్యతను అప్పగించింది. ఇటీవల ఢిల్లీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రిని కలిసినప్పుడు, కొత్త స్థల ప్రతిపాదనపై పది రోజుల్లో ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు నిర్దేశిత గడువులోగానే నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపడం గమనార్హం. ఆరు ప్రాంతాల పరిశీలన... రెండు స్థలాలు ఖరారు ఏటీఆర్‌-72-600 తరహా విమానాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూమి లభ్యత, భూతల స్వరూపం, రన్‌వే దిశ, ఎత్తు పరిమితి ఉపరితలాలు (అబ్‌స్టకల్‌ లిమిటేషన్‌ సర్ఫేసెస్‌), పర్యావరణ అంశాలు, రవాణా సౌకర్యాలను నిపుణుల బృందం క్షుణ్నంగా పరిశీలించింది. ఈ ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయనంలో సీతంపేట, సుజాతనగర్‌ ప్రాంతాలు అవసరమైన కీలక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, అనుకూలమైన భూతలం, భూవినియోగం, నిర్వహణ పరిస్థితులతో ఉన్నట్లు తేలింది. సుమారు 667 ఎకరాల ప్రతిపాదిత అభివృద్ధి స్థలాన్ని ఎలాంటి ప్రధాన పర్యావరణ, సాంకేతిక అవరోధాలు లేకుండానే సమకూర్చవచ్చని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఏళ్లుగా నానుతున్న స్థల నిర్ధారణ సమస్యకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. జిల్లా ప్రాధాన్యతను వివరించిన మంత్రి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటమే కాక, విశాలమైన గిరిజన, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోందని మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనులు, హెవీ వాటర్‌ ప్లాంట్‌, ఐటీసీ, బీపీఎల్‌ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు ఈ జిల్లా నిలయంగా ఉందని వివరించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారని, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వారి ప్రయాణం మరింత సులభతరమవుతుందని తెలిపారు. అంతేకాక, జిల్లాలోని అటవీ సంపద, ఖనిజ వనరులు, ఎకో టూరిజం అవకాశాలు, ప్రతిపాదిత ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు విమానాశ్రయం మరింత బలం చేకూరుస్తుందని, తద్వారా పెట్టుబడులు పెరిగి విద్యా, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. సంపూర్ణ సహకారం అందిస్తామన్న మంత్రి... ఫీజిబిలిటీ నివేదికను దయచేసి పరిగణనలోకి తీసుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని తుమ్మల తన లేఖలో అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తాయని హామీ ఇచ్చారు. ఫీజిబిలిటీ అధ్యయన నివేదిక ప్రతిని కూడా లేఖతో పాటు కేంద్ర మంత్రికి జతచేసినట్లు తెలిపారు. త్వరలో వాస్తవరూపం దాల్చనున్న చిరకాల స్వప్నం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసుల దశాబ్దాల కల అయిన గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం, తాజా పరిణామాలతో సాకారానికి మరింత చేరువైందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం నుంచి తుది ఆమోదం లభిస్తే, గిరిజన, పారిశ్రామిక, పుణ్యక్షేత్ర ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాకు గగనతల అనుసంధానం ఏర్పడి, ప్రాంతీయ ఆర్థిక ముఖచిత్రమే మారిపోనుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :