తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మురసు తుపాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సత్తుపల్లి సింగరేణి గెస్ట్ హౌస్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో కలిసి వరద పరిస్థితులు, సహాయక చర్యలపై ఆయన చర్చించారు.అంతకుముందు మంత్రి సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువును సందర్శించి, సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులను, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ