తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి వద్ద మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు కేకకట్ చేసి మొక్కలు నాటి నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభివృద్ధికి ఎంతగానో కృషిచేసి అభివృద్ధి పదంలో నడిపించిన నాయకులు నామ నాగేశ్వరరావు అని అన్నారు. అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు ఇన్కంటాక్స్ రద్దు జేయాలని కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో మొదట బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించిన తర్వాత పార్లమెంటులో బిఆర్ఎస్ పార్టీ సభా పక్ష నేతగా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలి అని కల్వకుంట్ల కవిత తో పాటు తన గొంతు కను గట్టిగ వినిపించిన మహా నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, ఈశ్వరి,సుమ, రాణమ్మ, ఉపేంద్ర, లక్ష్మి,, చంద్రకళ, సరిత, పుల్లమ్మ,, సత్యావతి, శివ,సత్తి, రోషన్, మధు,రాజు, షణ్ముఖ, కార్తిక్, వినీత్, పూర్ణ ప్రసాద్, కన్ని,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ