Saturday, 19 September 2026 08:53:02 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ మాత్రమే – పీవీకే-5 గని పిట్ కమిటీ

Date : 16 June 2026 02:04 PM Views : 96

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ ఎన్ టీ యు సి నాయకుల పోరాటం యాజమాన్యంపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా, లేక కార్మిక సంఘాలపైనా, ఐఎన్‌టీయూసీ వైఖరి స్పష్టం చేయాలి. ఐ ఎన్ టీ యు సి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యలపై పోరాడండి, కార్మిక సంఘాలపై కాదు, ఐఎన్‌టీయూసీకి ఏఐటీయూసీ హితవు డిపెండెంట్ ఉద్యోగాలు, సర్ఫేస్ పోస్టులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రూ.56 వేల కోట్ల బకాయిలపై ఐఎన్‌టీయూసీ నాయకులు సమాధానం చెప్పాలి – ఏఐటీయూసీ డిమాండ్. మంగళవారం ఉదయం పివికే5 గని లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఐటియుసి నాయకులు మాట్లాడుతూ అండర్‌గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనని,కార్మికులను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలను ఇతర యూనియన్లు చేపట్టడాన్ని పీవీకే-5 గని పిట్ కమిటీ తీవ్రంగా ఖండించారు, పీవీకే-5 గనిలో జరిగిన ఐ ఎన్ టీ యు సి గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీ యూనియన్‌ పై చేసిన విమర్శలను పిట్ కమిటీ ఖండించారు, ఐ ఎన్ టీ యు సి నాయకులు ఇకనుంచి పోరాటాలకు దిగుతామని చెప్పడం మంచిదే కానీ, అయితే ఆ పోరాటాలు ఐ ఎన్ టీ యు సి కి అనుబంధంగా ఉన్న ప్రభుత్వం పైన చేస్తారా,యాజమాన్యం పైన చేస్తారా, లేక ఇతర కార్మిక సంఘాల పైన చేస్తారా అనే విషయాన్ని ఐ ఎన్ టీ యు సి నాయకులు కార్మికులకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా డిపెండెంట్ లకు నియామక పత్రాలు ఇప్పించడం లో ఐ ఎన్ టీ యు సి పాత్ర ఏమిటో చెప్పాలని, డిపెండెంట్ వారసుల నియామకాల కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు చేసిన విషయం కార్మికులకు, డిపెండెంట్‌ లకు తెలుసని అన్నారు,అలాగే ఐ ఎన్ టీ యు సి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.56వేల కోట్ల బకాయిల విషయంలో ఐ ఎన్ టీ యు సి నాయకులు తన వైఖరిని వెల్లడించాలని, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి "మెడికల్ బోర్డును మేమే ఆపాము" అని చేసిన వ్యాఖ్యలపై కూడా ఐ ఎన్ టీ యు సి నాయకులు అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా పీవీకే5 గనిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత ఇంటి పథకం విషయంలో "రెవెన్యూ మంత్రిగా నేనే సంతకం చేసి ఇస్తాను" అని ఇచ్చిన హామీ అమలుపై ఐ ఎన్ టీ యు సి నాయకులు మంత్రిని ప్రశ్నించాలని డిమాండ్ కోరారు, అదేవిధంగా టి బి జి కే ఎస్, బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్న 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అంశంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు,మణుగూరులో సర్ఫేస్ పోస్టులు తమ వల్లే వచ్చాయని చెప్పుకుంటున్న ఐ ఎన్ టీ యు నాయకులు, కొత్తగూడెం ప్రాంతంలో మాత్రం సర్ఫేస్ పోస్టులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారో కార్మికులకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు, ఐఈడి ప్రకారం కొత్తగూడెం భూగర్భ గాని కార్మికులకు 270 సర్ఫేస్ పోస్టులు ఇప్పించి భూగర్భ గని కార్మికులకు న్యాయం చేస్తే, ఐ ఎన్ టీ యు సి నిర్వహించే పాలాభిషేక కార్యక్రమంలో ఏఐటీయూసీ కండువాలతో పాల్గొని పాలాభిషేకం చేస్తామని తెలిపారు, ఏఐటీయూసీతో ఎలాంటి సంబంధాలు వద్దని ఐ ఎన్ టీ యు నాయకులు చెప్పడం హాస్యాస్పదమని, అది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేదా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా అనేది స్పష్టం చేయాలని కోరారు., ఐ ఎన్ టీ యు సి నాయకులు చేసే పోరాటాలు కార్మిక సమస్యల పరిష్కారానికి దోహదపడేలా ఉండాలని, ఇతర కార్మిక సంఘాలపై విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదని తెలిపారు,ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి భూక్య రమేష్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్ సెత్, పిట్ ఉపాధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్ సాయి పవన్, సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్, సురేందర్ రెడ్డి, సంజీవ్, ప్రశాంత్, హరికృష్ణ, ఈర్ప కృష్ణ, సురేష్, రవీందర్, రాజేష్, కోటేశ్వరరావు, మహేష్, రామారావు, కార మోహన్, మదనయ్య, ముబారక్, మేకల శీను, మహేష్, సంతానం తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :