తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జులై 25 తెలుగు వెలుగు ) జననేత వైరా ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు అభిమాన కార్యకర్తలు జన్మదిన సంబరాలు జరిపారు. క్యాంప్ కార్యాలయంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోతు రాందాస్ నాయక్ జన్మదిన వేడుక లో పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పువల్లా దుర్గ ప్రసాద్, దుద్దుకూరి మధుసూదన్ రావు, చౌడం నరసింహారావు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, రామకృష్ణ, నాగరాజు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. జన్మదిన కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.బాణాసంచాలు కాల్చారు అభిమాన నాయకుని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొని అభిమానాన్ని చాటుకున్నారు. జూలూరుపాడు మండలంలోని గ్రామ గ్రామాన అంబరాన్నంటిన సంబరాలు
Admin
తెలుగు వెలుగు టీవీ