Wednesday, 04 November 2026 09:24:26 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

మారెళ్లపాడు ఎత్తిపోతల ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రులు

Date : 27 August 2026 03:41 PM Views : 151

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 29న శనివారం భద్రాద్రి జిల్లా పర్యటనకు రానున్న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి హెలిపాడ్,ఎత్తి పోతల పథకం కెనాల్,సభా స్థలాన్నీ పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ పనులన్నీ సకాలంలో పూర్తిచేయాలి, పినపాక ఎమ్మెల్యే పాయంతో కలిసి అధికారులకు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ అశ్వాపురం మండలంలోని మారెళ్లపాడు ఎత్తి పోతల పథకం ఈనెల 29న శనివారం ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి,వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు హజరుకానున్నారు. సీతారామా ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన మారెళ్ల పాడు ఎత్తిపోతల పథకం పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు భద్రాద్రి జిల్లా చేరుకునే అశ్వాపురం మండలంలోని బీ.జీ కొత్తూరు ప్రాంతంలోని హెలిపాడ్ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న పనులపై సలహాలు, సూచనలు అదికారులకు తెలియజేశారు. అదేవిధంగా మంత్రులు ప్రారంభించనున్న సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో మారెళ్లపాడు ఎత్తి పోతల పథకం కెనాల్,గొందిగూడెం - జీ.కొత్తూరు పల్లె ప్రకృతి ముందుగల ప్రాంతంలోని సభా స్థలాన్నీ పరిశీలించారు.ఈ క్రమంలో అక్కడ కొనసాగుతున్న పనులను త్వరితగదిన పూర్తి చేయాలని అధికారులకు,సిబ్బందికి సూచించారు.పథకం ప్రారంభోత్సవ సందర్భంగా పనులతీరు, మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని,ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ వసతులు కల్పించాలని పేర్కొన్నారు.సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ ఈ.ఈ వెంక టేశ్వరరావు, డీ.ఈ శ్రీనివాస్,వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :