Tuesday, 03 November 2026 12:55:20 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణపనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 29 June 2026 02:00 PM Views : 276

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యంగ్ ఇండియా స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి కీర్తి పతాక విద్యా హబ్ మారనున్న కొత్తగూడెం జిల్లా కేంద్రం రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో యంగ్ ఇండియా స్కూల్ 25 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి అన్ని వర్గాలకూ ఒకే క్యాంపస్ విద్య ఆలోచన అభినందనీయం వచ్చే విద్యాసంవత్సరంలో అందుబాటులోకి యంగ్ ఇండియా స్కూల్ కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక కీర్తి పతాక అని, ఈ స్కూల్ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లా కేంద్రం గొప్ప విద్యా హబ్'గా మారబోతోందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 'యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల' నిర్మాణ పనులను సోమవారం ఆయన అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకూ ఒకే క్యాంపస్ లో విద్యను అందించాలనే ప్రభుత్వ ఆలోచన ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగూడెం క్యాంపస్ లో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత అత్యాధునిక హంగులతో ఈ స్కూల్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. 25.475 ఎకరాల భారీ విస్తీర్ణంలో, 5,38,246 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో నిర్మిస్తున్న ఈ భారీ నిర్మాణాల్లో అకడమిక్ బ్లాక్, జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, డైనింగ్, కిచెన్ లతో పాటు సిబ్బంది కోసం క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ సరికొత్త స్కూల్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్దేశించుకొని పర్యవేక్షిస్తున్నామని, తెలిపారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, సైన్స్ ల్యాబ్‌లు, 5000 పైగా పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ కోర్టులను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, పర్యావరణ హితంగా ఉండేలా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సౌర, పవన విద్యుత్ వ్యవస్థలను, నీటి సంరక్షణ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను ఇక్కడ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రవాణాసౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, ఇప్పటికే రోడ్లు, బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీలు, ఔటర్ రింగు రోడ్లు కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్నింటికీ మంజూరు లభించిందని తెలిపారు. అన్ని కులాలవారికి 17 కమ్యూనిటీహాలు మంజూరు చేయడం జరిగిందని, ఎయిర్పోర్టు, అంతర్జీతీయ క్రికెట్ స్టేడియం, క్రీడామైదానాలు, జిమ్ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు శక్తివంచ లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, డీఈవో వాసంతి, పాఠశాలల భవనాల పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులు హేమచంద్ర రావు, రాజగోపాల్, నాయకులు వాసిరెడ్డి మురళి, యూసుఫ్, ధర్మరాజు, కార్పొరేటర్లు ఎర్రబెల్లి శంకర్, దుర్గ, సుధాకర్, పద్మ, ఆకాంక్ష, హిమశ్రీ, బండి నర్సింహా, విజయ్, తులశమ్మ, సహేరా, కళావతి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :