Wednesday, 16 September 2026 05:59:57 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 02 June 2025 04:39 PM Views : 513

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం,రాష్ట్ర సాధన కోసం జీవితాల్ని త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని అన్నారు.తెలంగాణ పోరాటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండే మొదలైందని గుర్తు చేశారు.ప్రశాంత వాతావరణం,శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని, దానికనుగుణంగా అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు, కీర్తి ప్రతిష్ట లు తీసుకురావాలని కోరారు.అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచే విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ జి.నరేందర్, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ఇతర పోలీస్ అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ విభాగ అధికారులు మరియు సిబ్బంది సమక్షంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :