తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాషరెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాదవరెడ్డి,టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు,రవిచందర్.వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన నూతన డీసీసీ అధ్యక్షులు అయూబ్. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతు ప్రస్తుతం వున్న జిల్లా కార్యవర్గ కమిటీ ని రద్దు చేస్తున్నామని, నూతన కార్యవర్గ కమిటీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని త్వరలోనే జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ జిల్లా అబ్జర్వర్ టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు మాట్లాడుతూ ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో ప్రతిఒక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి అధికారికంగా అర్హతలున్న నాయకులను జిల్లా లోని కార్యవర్గంలోకి తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. పదవులు పొందిన ప్రతి ఒక్క జిల్లా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామని, వారు వారి బాధ్యతల పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే 2029 పార్లమెంటు ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వరంగల్ జిల్లా కార్యవర్గం శక్తి వంచనకు మించి పనిచేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తను నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో వారి యొక్క బాధ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర జిల్లా, మండల, బ్లాక్, టౌన్ పరిధిలలోని కాంగ్రెస్ పార్టీ పదవులు నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, NSUI, యూత్ కాంగ్రెస్,మహిళా కాంగ్రెస్,మండల,బ్లాక్, టౌన్ అధ్యక్షులు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ, సేవ దళ్, INTUC మరియు అనుబంద సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని వారి జిల్లా కాంగ్రెస్ పదవుల కోసం దరఖాస్తులను సమర్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ