Monday, 02 November 2026 05:32:04 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 31 October 2026 09:12 PM Views : 274

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పివికే-5 గనిలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు.భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ఘనంగా అన్నదాన కార్యక్రమం.అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.పివికే-5 గనిలో శనివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిప్రపత్తులతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గని పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి ఆశీస్సులతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గని కార్మికులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలు, గని పరిస్థితులు, క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు.కార్మికులతో ఆయన కలిసిమెలిసి గడపడంతో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.అనంతరం గని మేనేజర్, ఏజెంట్ కలిసి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం భక్తి భావాన్ని చాటడంతో పాటు కార్మికులు, అధికారులు, సిబ్బంది మధ్య ఆత్మీయతను పెంపొందించింది.ఈ వేడుకల్లో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా,కొత్తగూడెం నగరపాలక మేయర్ మూడ్ గణేష్ యూనియన్ నాయకులు గని అధికారులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :