తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 7 తెలుగు వెలుగు ) : పడమటి నర్సాపురం గ్రామంలో సీతా రామచంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల మాల ధారలు ఇరుముడి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాలదారులు బంధువులతో గుడి ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. 41 రోజులపాటు దీక్ష చేసి గురుస్వామి రంగు నాగభూషణం చే ఇరుముడి కన్య స్వామి సురేష్ స్వామి, నాగరాజు స్వామి, దశరథ్ రాజు స్వామి, జస్వంత్ స్వామి లకు ఇరుముడి కట్టుకొని శబరిమలై దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఇరుముడి కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు
Admin
తెలుగు వెలుగు టీవీ