Friday, 18 September 2026 05:18:06 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 28 July 2026 03:33 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్‌నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలి ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి భూగర్భ జలాల సంరక్షణకు జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశాల సందర్భంగా రెండు రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో జూలూరుపాడు మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీల్లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, సాధించాల్సిన లక్ష్యాలపై మండల స్థాయి అధికారులు, సర్పంచులతో విస్తృతంగా చర్చించారు. జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ మరుగుదొడ్లు, ఫారం పాండ్లు, పర్‌కొలేషన్ ట్యాంకుల నిర్మాణం, అలాగే ఎల్‌నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సుమారు 40 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసినప్పటికీ, ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఎల్‌నీనో ప్రభావం కారణంగా అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో వేడి శాతం పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు . ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక, విద్య తదితర శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు మండల స్థాయి సమావేశాల్లో విస్తృతంగా చర్చించి, రాబోయే సంవత్సరంలో ఎల్‌నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు. గత సీజన్‌లో వరితో పాటు మొక్కజొన్న సాగు కూడా అధికంగా జరిగిందని, సుమారు 42 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పాటు 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, ఇతర ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు సుమారు 25 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. అలాగే పత్తి, కూరగాయలు వంటి మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న కలెక్టర్, ప్రతి గ్రామంలో ఫారం పాండ్లు, పర్‌కొలేషన్ ట్యాంకులు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ, జూలూరుపాడు మండలానికి 99 ఫారం పాండ్ల నిర్మాణ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు 29 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం నాలుగు ఫారం పాండ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. గాంధీనగర్, గుండ్లరేవు, కాకర్ల,కొత్తూరు, దలవల తండా గ్రామాల్లో ఇప్పటివరకు ఫారం పాండ్లు గుర్తించలేదని , ఆయా గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పర్‌కొలేషన్ ట్యాంకులు, ఫారం పాండ్లు ఏర్పాటు చేసేలా సర్పంచులు, అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి సహకరించాలని ఆమె కోరారు. అనంతరం శాఖల వారీగా మండలంలో చేపడుతున్న కార్యక్రమాలను మండల స్థాయి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శైలజ, తాసిల్దార్ శ్రీనివాస్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :