Sunday, 07 June 2026 08:47:35 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి.

Date : 11 April 2026 07:25 PM Views : 213

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీ సేవ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో 580కు పైగా సేవలు. డిజిటల్ సేవల్లో తెలంగాణ ముందంజ.రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. ప్రజలకు సులభంగా, వేగంగా ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం 580కు పైగా సేవలను అందిస్తూ రాష్ట్రంలో ప్రముఖ డిజిటల్ సేవా వేదికగా నిలుస్తోంది.2025 నవంబర్ 18న ప్రారంభమైన ఈ సేవలు తక్కువ సమయంలోనే విస్తృతంగా ప్రజాదరణ పొందాయి. ప్రజలు 8096958096 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపడం ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు.తాజాగా ఈ సేవల్లో భాగంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 12, 2026 నుండి విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ విధానంతో వెబ్‌సైట్‌లలో లాగిన్ కావడం లేదా మీ సేవ కేంద్రాలను సందర్శించడం అవసరం ఉండదు.ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు ఎస్సెస్సీ హాల్ టికెట్లను ఉచితంగా, తక్షణం అందించిన ఈ ప్లాట్‌ఫామ్, విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది.విద్యార్థులు తమ ఫలితాలను పొందేందుకు ముందుగా 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో “Hi” మెసేజ్ పంపాలి. అనంతరం “BIE Exam Result” సేవను ఎంపిక చేసి, తమ రోల్ నంబర్, సంవత్సరం (1వ లేదా 2వ సంవత్సరం), స్ట్రీమ్ (జనరల్ లేదా వొకేషనల్) వివరాలను నమోదు చేసి సమర్పిస్తే, ఫలితం వెంటనే వాట్సాప్‌లో అందుతుంది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మీ సేవ వాట్సాప్ సేవలు ప్రజలు ప్రతిరోజూ వినియోగించే డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి చేరవేసే వినూత్న చర్యగా నిలుస్తున్నాయని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :